ఈరోజుల్లో వివాహం కావడం అనేది చాలామందికి ఓ సవాలుగా మారుతోంది. ముఖ్యంగా మగవారి విషయంలో ఇది ఎక్కువగా కనబడుతోంది. తెలంగాణలోని హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన నరేష్ తనకు ఎంతకూ పెళ్లి కావడం లేదని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
తల్లిదండ్రులు సురేందర్, రమ తమ కుమారుడు నరేష్ కి గత నాలుగైదేళ్లుగా సంబంధాలు చూస్తున్నారు. నరేష్ హైదరాబాదులోని అమీర్ పేటలోని ఓ బట్టల షాపులో పనిచేస్తున్నాడు. బట్టల షాపులో పనిచేస్తున్నాడని చెప్పగానే పిల్లనిస్తానన్నవారు కూడా ఇచ్చేందుకు ముందుకు రాకుండా పోతున్నారట. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన నరేష్ ఘట్ కేసర్ రైల్వే స్టేషను సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.