పెళ్లికి ముందే వరకట్న వేధింపుల కారణంగా ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ పేరుతో మోసం చేసి ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనా.. పెళ్లికి ముందే వరకట్నం కోసం వేధించడంతో ఆ యువతి ఇక లాభం లేదనుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కులాలు వేరు కావడంతో ఇద్దరి పెళ్లికి పెద్దల నిరాకరించారు. అయితే డబ్బులు, నగలు ఇస్తే తానే పెళ్లి చేసుకుంటానని ప్రేమికుడు అడ్డం తిరగడంతో ఆమెకు ఆత్మహత్య తప్ప వేరే దారి దొరకలేదు.
వివరాల్లోకి వెళితే.. ప్రేమ పేరుతో శ్రీకాంత్ మోసం చేశాడన్న మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని అనూష ప్రాణాలు తీసుకుంది. అనూష తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే ఒక్క కూతురు ప్రాణాలు కోల్పోవడంతో బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శ్రీకాంత్ అతని కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉన్నారని సీఐ ప్రమోద్ తెలిపారు.