బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కేసీఆర్ కుమార్తె కవిత తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే పనిలో వున్నారు. తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది కానీ కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు కలలుగన్న నీళ్లు, నిధులు, ఉద్యోగాలు రాలేదని ఆమె విమర్శిస్తున్నారు. తను ప్రజల కోసం ఏది చేయాలన్నా బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడ్డారంటూ విమర్శించారు. తెలంగాణ శాసనమండలిలో తన వ్యధనంతా చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు.
ఇక అసలు విషయానికి కవిత పెద్ద కుమారుడు ఆదిత్య బహిరంగ కార్యకలాపాల్లో కనిపిస్తున్నారు. అక్టోబర్ 2025లో హైదరాబాద్‌లో జరిగిన బీసీ సంఘాల బంద్‌లో ఆయన తన తల్లితో కలిసి పాల్గొని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తల్లి వెంట ఆదిత్య చురుకుగా ప్రతి ఈవెంట్లో కనబడుతూ వున్నాడు. ఆదిత్య అమెరికాలోని వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ నుండి 2025 మే నెలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ వేడుకకు కవిత గారు, ఆమె భర్త అనిల్ కుమార్ కూడా హాజరయ్యారు.
ప్రస్తుతం కవిత గారు బి.ఆర్.ఎస్ (BRS) నుండి బయటకు వచ్చి సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న తరుణంలో, ఆదిత్య ఆమెకు మద్దతుగా నిలుస్తూ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.