Publish Date: Tue, 07 Apr 2026 (11:33 IST)
Updated Date: Tue, 07 Apr 2026 (11:36 IST)
హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసులు ఒక రెస్టారెంట్‌పై దాడి చేసి, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన బిర్యానీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెస్టారెంట్ యజమాని, అదే బిర్యానీ ప్యాకెట్లను ఓవెన్‌లో వేడి చేసి తిరిగి విక్రయిస్తూ, వినియోగదారుల ప్రాణాలను ప్రమాదంలో పడవేస్తున్నట్లు గుర్తించారు.
ఈ రెస్టారెంట్ వారు జీడిమెట్లలో బిర్యానీని తయారు చేసి, ఆన్‌లైన్ ఆహార డెలివరీ సేవల ద్వారా బంజారా హిల్స్‌లో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ బిర్యానీని లక్కీ బిర్యానీ అండ్ షవార్మా పేరుతో విక్రయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.