పీకలదాకా మద్యం సేవించి వచ్చి తరగతి గదిలో నిద్రపోయిన తాగుబోతు టీచర్!

ఠాగూర్
గురువారం, 4 సెప్టెంబరు 2025 (14:21 IST)
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్... పీకల వరకు మద్యం సేవించి మద్యం మత్తులో పాఠశాలకు వచ్చి తరగతి గదిలోనే గుర్రుపెట్టి నిద్రపోయాడు. ఈ ఆసక్తికర ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం సుకుత్ పల్లి ఆశ్రమ పాఠశాలలో ఎస్.జి.టిగా జె.విలాస్ అనే వ్యక్తి పని చేస్తున్నారు. అయితే, ఆయన ఇటీవల మద్యం సేవించి పాఠశాలకు హాజరయ్యారు. మద్యం మత్తులో తరగతి గదిలోనే నిద్రలోకి జారుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
గ్రామస్థులు నుంచి అందిన ఫిర్యాదుపై అధికారులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ప్రాజెక్టు ఆఫీసర్ ఆదేశాలు జారీచేశారు. విచారణలో ఉపాధ్యాయుడు విలాస్ నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలడంతో ఆయనను తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments