Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంగ్లాండ్- పాకిస్థాన్ ట్వంటీ- 20 మ్యాచ్ హైలెట్స్

ఇంగ్లాండ్- పాకిస్థాన్ ట్వంటీ- 20 మ్యాచ్ హైలెట్స్
ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఆతిథ్య జట్టు- పాకిస్థాన్ మధ్య జరిగిన గ్రూపు బి మ్యాచ్ హైలెట్స్..

-> క్రిస్ బ్రాడ్ (3/17) అంతర్జాతీయ ట్వంటీ- 20 క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో 2007లో జరిగిన మ్యాచ్‌లో నమోదైన 3/37 ఇప్పటివరకు క్రిస్ బ్రాడ్ అత్యుత్తమ ప్రదర్శన.

-> ల్యూక్ రైట్ ట్వంటీ- 20 క్రికెట్‌‍లో తొలి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించాడు.

-> సయీద్ అజ్మల్ (2/23) అంతర్జాతీయ ట్వంటీ- 20 క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.

-> ట్వంటీ- 20 క్రికెట్‌లో పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ సాధించిన తొలి విజయమిది. ఇంతకుముందు (ఆగస్టు 28, 2007) ఆడిన ట్వంటీ- 20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను పాకిస్థాన్ ఓడించింది.

-> ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు ఇది రెండో విజయం.

-> ట్వంటీ- 20 క్రికెట్‌లో ఇంగ్లాండ్‌పై పాకిస్థాన్ అతి తక్కువ స్కోరు నమోదు చేసింది. బ్రిస్టల్‌లో ఆగస్టు 28, 2007లో ఇంగ్లాండ్‌పై పాకిస్థాన్ 148 పరుగులు సాధించింది. ఆ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించింది.

-> పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ అత్యధిక స్కోరు ఈ మ్యాచ్‌లో నమోదు చేసింది. ఇంతకుముందు వరకు బ్రిస్టల్‌లో ఆగస్టు 28, 2007లో సాధించిన 144 పరుగులే అత్యధిక స్కోరు.

Share this Story:

Follow Webdunia telugu