Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వైన్‌ఫ్లూ కారణంగా 5 వేలమంది మృతి

స్వైన్‌ఫ్లూ కారణంగా 5 వేలమంది మృతి
FILE
స్వైన్‌ఫ్లూ ( హెచ్1ఎన్1 ఇన్ఫ్ల్యూయెంజా ) మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు వేలమంది మృతి చెందారు. ప్రస్తుతం ఈ వ్యాధి సోకినవారి సంఖ్య 4 లక్షల 78 వేల 223కు చేరుకుంది. ఇప్పటి వరకు 191 దేశాల్లో ఈ వ్యాధి బారిన పడినవారున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

డబ్ల్యూహెచ్ఓ తెలిపిన వివరాల మేరకు ప్రస్తుతం ఇప్పటి వరకు 191 దేశాల్లో ఈ వ్యాధి సోకినవారి సంఖ్య 4 లక్షల 78 వేల 223కు చేరుకుందని, స్వైన్‌ఫ్లూ సోకి మృతి చెందిన వారి సంఖ్య ఐదువేలకు చేరుకుంది.

ప్రస్తుతం ఈ వ్యాధికి సంబంధించిన వైరస్ వ్యాపిస్తోందని, ఇది మరిన్న దేశాలకు ప్రాకే ప్రమాదం ఉందని, దీంతో వైరస్ సోకి మృతి చెందేవారి సంఖ్య మరింత రెట్టింపయ్యే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ అనుమానం వ్యక్తం చేసింది.

ఇప్పటివరకైతే ఈ వ్యాధికి ఎలాంటి టీకా, మందు, వైద్యం తదితరాలేవీ లేవని, కాని అంతర్జాతీయపరంగా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తగిన కృషి జరుగుతోందని, అక్టోబర్ నెలలోపే ఈ వ్యాధికి సంబంధించిన టీకాలను కనుగొంటామని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.

ప్రపంచంలోనే అత్యధికంగా ఈ వ్యాధిబారిన పడిన దేశాలలో అగ్రరాజ్యమైన అమెరికా దేశం ప్రథమ స్థానంలో ఉందని డబ్ల్యూహెచ్ఓ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇక్కడ ఇప్పటి వరకు 60 వేల 129 మందికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారించారని, వీరిలో 3539 మంది మృతి చెందినట్లు సంస్థ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu