Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వైన్ ఫ్లూ: జాగ్రత్తలు

స్వైన్ ఫ్లూ: జాగ్రత్తలు
నేడు అందరినీ భయాందోళనలకు గురిచేస్తున్న వ్యాధి స్వైన్ ఫ్లూ. ప్రతిరోజూ ఒక కొత్త కేసు నమోదవుతోంది. అటువంటి జాబితాలో చేరకుండా ఉండాలంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

చేతులకు మురికి కానివ్వకండి. ఇతరులతో చేయి కలిపిన ప్రతిసారి చేతులను సబ్బుతో శుభ్రపరుచుకుంటూ ఉండండి. తమ్ము, దగ్గు వచ్చినప్పుడు ముక్కు, నోరు దగ్గర అడ్డం పెట్టుకున్న చేతులను వెంటనే కడుక్కోవడం అవసరం. అలా కడుక్కోకుండా చేతులతో కళ్లు, ముక్కు, నోటిని అసలు తాకవద్దు.

ఇతరత్రా బలహీనంగా ఉన్నప్పుడు అంటు రోగాలు సులభంగా సోకుతాయి. కాబట్టి పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి తగినంత నీరు అందించాలి. నిద్ర, విశ్రాంతి విషయంలో అశ్రద్ధ ఎంతమాత్రం చేయవద్దు.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్వైన్ ప్లూ సోకవచ్చు. ఆ రోగ లక్షణాలైన శ్వాసక్రియ ఇబ్బంది, నీరు తాగాలని అనిపించకపోవడం, అతిగా నిద్ర, చిరాకు, జ్వరం వంటివి కనిపించినపుడు వెంటనే వైద్యుని వద్దకెళ్లి పరీక్ష చేయించుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu