బాదం చిక్కీలు తయారు చేయడం ఎలా..!!
, సోమవారం, 23 ఏప్రియల్ 2012 (16:13 IST)
కావలసిన పదార్థాలు :బాదం - ఓ కప్పువేరుసెనగ పప్పు - ఓ కప్పునువ్వులు - ఓ కప్పుజీడిపప్పు - ఓ కప్పునెయ్యి - టేబుల్ స్పూన్పంచదార - ఓ కప్పుతయారు చేసే విధానం :స్టవ్ పైన బాణలి పెట్టి అందులో పొట్టుతీసిన వేరుసెనగపప్పు, బాదం, జీడిపప్పు, నువ్వుల్ని ఒకదాని తర్వాత ఒకటి చొప్పున వేసి దోరగా వేయించుకోవాలి. మరో బాణలిలో పంచదార వేసి కరిగించాలి. అది కరిగి తేనె రంగులోకి వచ్చేదాకా ఉంచి ఆ తరువాత జీడిపప్పు, వేరు సెనగపప్పు, బాదం పలుకులు, నువ్వుల్ని కలిపి దింపేయాలి.ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పీటమీద పరిచి, నెయ్యి రాసిన రొట్టెల కర్రతో చపాతీ ఒత్తినట్లు చేయాలి. కత్తితో మీకు ఇష్టం వచ్చిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవచ్చు. ఇంకా గుండ్రంగా కూడా చేసుకోవచ్చు. అయితే వేడిగా ఉన్నప్పుడు మాత్రమే రకరకాల ఆకారం కుదురుతుంది. వేడి తగ్గితే అనుకున్న ఆకారం రాదు. ఈ చిక్కీలను నిల్వ ఉంచుకొని ప్రతిరోజు తినచ్చు.