Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గజవాహనంపై విహరించనున్న తిరుమలేశుడు

గజవాహనంపై విహరించనున్న తిరుమలేశుడు
బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజున శ్రీవారు ఉదయం హనుమద్వాహనంపై ఊరేగారు. గురువారం సాయంత్రం స్వర్ణ రథోత్సవ సేవ కన్నులపండువగా సాగింది. సర్వలోకాలకు హాయిని గొలిపే "వసంత కాల విలాసుడు" స్వామియే అని ప్రకటించడానికి విరుల జల్లులు, వివిధ వర్ణశోభిత పరిమళ భరిత ద్రవ్యజలాల చిలకరింపులు, గీత గాన నృత్యాల పలకరింపులతో అత్యంత మనోహరంగా స్వర్ణ రథోత్సవం జరిగింది. రాత్రికి స్వామివారు గజవాహనంపై విహరించనున్నారు. స్వామివారిని కనులారా దర్శించుకునేందుకు తిరుమల కొండకు భక్త జనులు తండోపతండాలుగా వస్తున్నారు.

గజవాహనంపై స్వామివారి ఊరేగింపు గురువారం రాత్రి 9 గంటలకు ప్రారంభమై 11 గంటలకు ముగుస్తుంది. అదేవిధంగా పూలంగి సర్వదర్శనము రాత్రి 8 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి 12. 30 గంటలవరకూ సాగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu