Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా జీవిత కథ సినిమాగా వద్దు.. దీపికా అయితే ఓకే: సానియా

నా జీవిత కథ సినిమాగా వద్దు.. దీపికా అయితే ఓకే: సానియా
, శుక్రవారం, 14 నవంబరు 2014 (19:12 IST)
మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా ప్రియాంక చోప్రా నటించిన నేపథ్యంలో.. తన జీవిత కథను సినిమాగా తీయడం ఇష్టం లేదని టెన్నస్ స్టార్ సానియా మీర్జా మనసులోని మాటను బయటపెట్టింది. ఒకవేళ సినిమాగా తీస్తే తెరపై సానియా పాత్రను దీపికా పదుకొనే పోషిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. 
 
ఇటీవల తనను ఓ దర్శకుడు కలిశారని, తన జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మించాలని ఉందని తనతో దర్శకుడు చెప్పారని.. అయితే తాను తిరస్కరించినట్టు సానియా మీడియాకు తెలిపారు.
 
తన జీవితంలోని సంఘటనల్ని బహిరంగం చేయకూడదనే ఉద్దేశ్యంతోనే ఇటీవల ఓ సినీ దర్శకుడి విజ్ఞప్తిని తిరస్కరించినట్టు తెలుస్తోంది. తన జీవిత కథ సినిమాగా రూపొందడం ఇష్టం లేదని, తాను కలివిడి మనిషి కాను. తన జీవితంలోని ముఖ్య సంఘటనలు ప్రజలతో పంచుకోవడం ఇష్టం లేదని సానియా తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu