Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెరెనా, వీనస్ విలియమ్స్ సెల్ఫీ అదుర్స్: సాధ్యమైతే ఆపుకోండి చూద్దాం..

సెరెనా, వీనస్ విలియమ్స్ సెల్ఫీ అదుర్స్: సాధ్యమైతే ఆపుకోండి చూద్దాం..
, శనివారం, 1 ఆగస్టు 2015 (12:38 IST)
అమెరికా నల్ల కలువలు, టెన్నిస్ సిస్టర్స్ వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్ టెన్నిస్ కోర్టులో మళ్లీ ఏకం కావాలనుకుంటున్నారు. మహిళల సింగిల్స్‌లో వీరిద్దరూ సాధించని విజయాలంటూ లేవు. ఒంటరిగానూ అద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్న వీరిద్దరూ కెరీర్ చివరి దశకు చేరుకున్నా.. ప్రత్యర్థుల రైళ్లల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నారు. కొత్త క్రీడాకారిణులు వస్తున్నా వీరి ప్రతిభకు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. 
 
తాత్కాలికంగా ఎవరైనా బ్రేక్ వేసినా, వెంటనే పుంజుకుంటున్న సెరెనా సిస్టర్స్ తమదైన శైలి సత్తా చాటుకుంటున్నారు. త్వరలోనే తాము డబుల్స్ విభాగంలో జతకట్టనున్నామని.. తమని ఆపడం ఎవరికైనా సాధ్యమైతే ఆపుకోవాలని సవాలు విసిరారు. ఈ మేరకు వీరిద్దరూ కలిసి ప్రాక్టీస్ చేసిన సెల్ఫీని వీనస్ విలియమ్స్ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరూ ఏ టెన్నిస్ టోర్నీ కోసం ఏకం కావాలనుకుంటున్నారో తెలియజేయలేదు.

Share this Story:

Follow Webdunia telugu