Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యుఎస్ ఓపెన్ : డొమ్నికా సిబుల్కోపై బెలిస్ సంచలనం!

యుఎస్ ఓపెన్ : డొమ్నికా సిబుల్కోపై బెలిస్ సంచలనం!
, గురువారం, 28 ఆగస్టు 2014 (12:03 IST)
యుఎస్ ఓపెన్ టెన్నిస్‌లో ఓ సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా ఓపెన్ రన్నరప్, 12వ సీడ్ అయిన డొమ్నికా సిబుల్కోవా 6-1, 4-6, 6-4 సెట్ల స్కోరుతో తేడాతో క్యాథరిన్ కార్టన్ బెలిస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో అన్నా కోర్నికోవా తర్వాత 15 ఏళ్ళ వయస్సులో యుఎస్ ఓపెన్‌లో మ్యాచ్ గెలిచిన ఘనతను క్యాథరిన్ కార్టన్ బెలిస్ సాధించింది. 
 
అయితే, బెలిస్ వయస్సు కేవలం పదిహేనేళ్ళే కావడం గమనార్హం. అయినా పిట్టకొంచెం కూతఘనం అన్నట్టుగా టెన్నిస్ క్రీడలో పెను సంచలనమే సృష్టించింది. అమెరికాకు చెందిన ఈ యువ కెరటం ప్రపంచ టెన్నిస్ 1208వ ర్యాంకర్. యుఎస్ ఓపెన్ ఛాంపియన్ షిప్ మొదలైన రెండోరోజే అరుదైన రికార్డునుస సృష్టించింది. 

Share this Story:

Follow Webdunia telugu