Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కంటతడి పెట్టిన సానియా మీర్జా: స్థానికతపై వ్యాఖ్యలతో హర్ట్!

కంటతడి పెట్టిన సానియా మీర్జా: స్థానికతపై వ్యాఖ్యలతో హర్ట్!
, శుక్రవారం, 25 జులై 2014 (17:39 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కంటతడి పెట్టారు. సానియా పాకిస్థాన్ కోడలు అని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే లక్ష్మణ్ వ్యాఖ్యలతో ఆమె హర్ట్ అయ్యారు. కొందరు తన స్థానికత పైన వ్యాఖ్యలు చేయడం బాధించిందన్నారు. ఈ సమయంలో ఆమె ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. తాను భారత్ తరఫున ఆడానని, పెళ్లయ్యాక కూడా భారత్ తరఫునే మెడల్స్ సాధించానని చెప్పారు. తాను భారతీయురాలు అయినందుకు గర్విస్తున్నానని చెప్పారు. 
 
హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు ప్రభుత్వం నుండి అందాల్సిన బకాయిల పైన తాను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో మాట్లాడానని, ఆ సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా అన్నారు. మరోవైపు మెదక్ రైలు ఘటనపై సానియా ట్వీట్ చేశారు. ఘోర దుర్ఘటన అని, బాధిత కుటుంబాలకు సానియా సంతాపం తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu