Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ విన్నర్ సెరీనా విలియమ్స్... షరపోవా చిత్తు

ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ విన్నర్ సెరీనా విలియమ్స్... షరపోవా చిత్తు
, శనివారం, 31 జనవరి 2015 (23:39 IST)
ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మహిళల ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ విజయం సాధించి ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకుని విజయ దరహాసం చేసింది. ఇది సెరీనా విలియమ్స్‌కి 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌. కాగా ఈ ఫైనల్లో సెరీనా విలియమ్స్, షరపోవాల మధ్య పోటీ ఉత్కంఠ భరితంగా సాగుగా సెరీనా షరపోవా పైన 6-3, 7-6 (7-5) స్కోరుతో విజయం సాధించింది.
 
ఫలితంగా సింగిల్స్ ఫైనల్లో విజయం సాధించిన సెరెనా విలియమ్స్ ఆరవ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో సెరీనా విలియమ్స్ 19వ గ్రాండ్ స్లామ్‌ను సొంతం చేసుకున్నట్లయింది.
 
ఇకపోతే.. సెరెనా తాజా విజయంతో 19 మేజర్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన మార్టినా నవ్రోతిలోవా, క్రిస్ ఎవర్ట్‌ల సరసన చేరింది. 2004 నుంచి 16 సార్లు పోటీపడిన సెరీనా విలియమ్స్... తాజాగా రష్యన్ క్రీడాకారిణి, ప్రపంచ నెంబర్ 2 మారియా షరపోవాను ఓడించింది.

Share this Story:

Follow Webdunia telugu