Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఊపిరున్నంత వరకు ఇండియన్ గానే ఉంటా: సానియా మీర్జా

ఊపిరున్నంత వరకు ఇండియన్ గానే ఉంటా: సానియా మీర్జా
, గురువారం, 24 జులై 2014 (14:48 IST)
తన ఊపిరున్నంత వరకు ఇండియన్‌గానే ఉంటానని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేసింది. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌ సానియా ఎంపిక కావడంతో సర్వత్రా స్థానికత విమర్శలు వెల్లువెత్తాయి. సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం పట్ల బీజేపీ అభ్యంతరం చేసింది. పాకిస్థాన్ కోడలిని అంబాసిడర్‌గా ఎలా నియమిస్తారని బీజేపీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సానియా మీర్జా మాట్లాడుతూ.. తాను భారతీయురాలినేనని తేల్చి చెప్పింది. 
 
తనను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా తనను నియమించడంపై కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేయడం తనను బాధించిందని పేర్కొంది. ఈ విషయంపై ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదని సానియా వాపోయింది.
 
తనను భారతీయురాలు కాదంటే ఒప్పుకోనని కుండబద్దలు కొట్టింది. తనపై బయటివ్యక్తి(అవుట్సైడర్) ముద్ర వేయడాన్ని సానియా ఖండించింది. తన కుటుంబం శతాబ్దకాలంగా హైదరాబాద్‌లో నివసిస్తోందని తెలిపింది. అనవసర విషయాలపై సమయం వృధా చేయకుండా రాష్ట్రం, దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెడితే మంచిదని సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu