Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెన్నిస్‌లోనూ ఫిక్సింగ్ భూతం: ఆస్ట్రేలియాలో ఆరుగురు అరెస్ట్!

టెన్నిస్‌లోనూ ఫిక్సింగ్ భూతం: ఆస్ట్రేలియాలో ఆరుగురు అరెస్ట్!
, శనివారం, 19 జులై 2014 (14:36 IST)
టెన్నిస్‌ టోర్నీలకు కూడా ఫిక్సింగ్ భూతం పట్టింది. ఇప్పటి వరకు క్రికెట్లోనే ఎక్కువగా కనిపించే మ్యాచ్ ఫిక్సింగ్.. ఇప్పుడు టెన్నిస్ ఆటకు పాకింది. టెన్నిస్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆరుగురు ఆస్ట్రేలియన్లను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో టెన్నిస్ ఆటగాళ్లు కూడా ఉన్నట్లు సమాచారం. 
 
ఇటీవల జరిగిన ఓ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీని ఫిక్సింగ్ చేసేందుకు ఈ ఆరుగురు ఆస్ట్రేలియన్లు ప్రయత్నించారు. వీరిని మెల్ బోర్న్, విక్టోరియా పట్టణంలోని పరిసర ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. విక్టోరియా పట్టణంలో ముఠాగా ఏర్పడిన కొంతమంది ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నారని ఓ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. 
 
కాగా, ఫిక్సింగ్ అనేది క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకమని, క్రీడా స్ఫూర్తికి భంగం కలిగించే చర్యలు చేపట్టే వారిపై కఠిన చర్యలుంటాయని టెన్నిస్ ఆస్ట్రేలియా హెచ్చరించింది.

Share this Story:

Follow Webdunia telugu