Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

16 ఏళ్ల బాలికను అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి లైంగికంగా అనుభవించిన అథ్లెట్.. ఆపై..?

ఓ పారా అథ్లెట్ ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిందిపోయి.. బ్రోకర్ అవతారం ఎత్తాడు. సింగపూర్‌కు చెందిన ఓ పారా అథ్లెట్ వ్యభిచారం చేయించే మేనేజర్‌గా మారిపోయాడు. ఇందుకోసం సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్ ద్వారా మహ

16 ఏళ్ల బాలికను అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి లైంగికంగా అనుభవించిన అథ్లెట్.. ఆపై..?
, మంగళవారం, 28 జూన్ 2016 (11:55 IST)
ఓ పారా అథ్లెట్ ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిందిపోయి.. బ్రోకర్ అవతారం ఎత్తాడు. సింగపూర్‌కు చెందిన ఓ పారా అథ్లెట్ వ్యభిచారం చేయించే మేనేజర్‌గా మారిపోయాడు. ఇందుకోసం సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్ ద్వారా మహిళలను, మైనర్లను కొనుగోలు చేశాడు. కానీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని.. 38 నెలల జైలు శిక్ష విధించారు. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. అదామ్ కామిస్ అనే వ్యక్తి సింగపూర్ జాతీయ పారా అథ్లెట్‌. గతంలో 2010లో ఢిల్లీలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్కు ప్రతినిధిగా కూడా పనిచేశాడు. ఇతడో ప్రమాదంలో గాయపడటంతో వికలాంగుడయ్యాడు. 2013లో ఫేస్ బుక్ ఖాతా తెరిచి దాని ద్వారా వ్యభిచారం చేయించేందుకు 11మంది మహిళలను రిక్రూట్ చేశాడు. ఓ మైనర్ బాలికను కూడా రిక్రూట్ చేసి వ్యభిచార కూపంలోకి దించాడు. వారి నుంచి ఐదు నుంచి 50 శాతం వరకు కమిషన్ తీసుకున్నాడు. ఓ ఎస్కార్ట్ ఉద్యోగినంటూ పరిచయం చేసుకుని డబ్బును ఎరగా వేసేవాడు. డబ్బుకు ఆశపడి.. మహిళలు అతనితో మాటలు కలిపేవారు. తర్వాత వారిని వ్యభిచారంలోకి మెల్లగా లాగేసేవాడు.
 
అయితే 16 ఏళ్ల విద్యార్థినిని కలిసి తన అపార్ట్‌మెంట్కు తీసుకెళ్లి లైంగికంగా అనుభవించడమే కాకుండా ఆమెతో కూడా వ్యభిచారం చేయించే ప్లాన్ చేశాడు. అయితే ఈ  విషయాన్ని ఎంతో చాకచక్యంతో పోలీసులు కనిపెట్టిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 30 అభియోగాల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెక్‌కల్లమ్ క్రికెటింగ్ లెవెన్ జాబితాలో ఒకే ఒక్కడుగా సచిన్!