Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూఎస్ ఓపెన్ ఫైనల్లో వోజ్నియాకీ: సెరెనాతో టైటిల్ పోరు..

యూఎస్ ఓపెన్ ఫైనల్లో వోజ్నియాకీ: సెరెనాతో టైటిల్ పోరు..
, ఆదివారం, 7 సెప్టెంబరు 2014 (12:31 IST)
యూఎస్ ఓపెన్ ఫైనల్లో వోజ్నియాకీ దూసుకెళ్లింది. 2009 ఫైనల్‌లో కిమ్ క్లిజ్‌స్టెర్స్ చేతిలో ఓటమిపాలైన తర్వాత వోజ్నియాకి యుఎస్ ఓపెన్ ఫైనల్ చేరడం ఇదే రెండోసారి కావడం గమనార్హం. కాగా కెరీర్‌లో రెండోసారి ఒక గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్ ఫైనల్‌లోకి అడుగుపెట్టిన వొజ్నియాకి టైటిల్ కోసం ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్‌తో ఢీ కొంటుంది. 
 
ఇప్పటి వరకూ 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించిన సెరెనా సెమీ ఫైనల్‌లో ఎకతరిన మకరోవాపై 6-1, 6-3 ఆధిక్యంతో సునాయాసంగా విజయం సాధించింది. ఈ ఏడాది గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో ఇప్పటి వరకూ నాలుగో రౌండ్ దాటలేకపోయిన సెరెనా సెమీస్‌లో మకరోవాను ఓడించిన తర్వాత ఆనందంతో గంతులేసింది. ఈ నేపథ్యంలో వోజ్నియాకీకి సెరెనాతో గట్టిపోటీ తప్పదని క్రీడా పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu