Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుత్తాను గుర్తు చేసుకుంటున్న సానియా మీర్జా.. గ్లామర్ ఇలా లిమిటెడ్‌గా?

గుత్తాను గుర్తు చేసుకుంటున్న సానియా మీర్జా.. గ్లామర్ ఇలా లిమిటెడ్‌గా?
, మంగళవారం, 6 అక్టోబరు 2015 (10:45 IST)
భారత్ టెన్నిస్‌కు కళ తెచ్చిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు గ్లామర్ ఫీల్డ్‌పై మమకారం చాలా ఉంది. అందుకే పైన కనిపించినట్లుగా.. అందాలు చిందిస్తూ.. ఫ్యాషన్ వేర్లో కవర్‌పేజుల్లో కనిపిస్తోంది. తాజాగా జ్యూస్ కవర్ మేగజైన్ కోసం సానియా మీర్జా ఫోజిచ్చింది. సినీ ఇండస్ట్రీలో కాలు పెట్టాలనుకుంటున్నా.. తోటి ప్లేయర్ జ్వాలా గుత్తాకి ఎలాంటి అనుభవం ఎదురైందో సానియా ఓసారి గుర్తు చేసుకుంటూనే ఉంది. 
 
అందుకే గ్లామర్‌ని లిమిటెడ్‌గా ఒలకబోస్తూ.. అన్ లిమిటెడ్ గాసిప్స్‌కు సెంటరవుతోంది. ఆట కంటే పొట్టి డ్రస్సుల తోనే బాగా పాపులర్ అయినా.. తర్వాత సానియా మీర్జా గేమ్‌లోనూ తన సత్తా ఏంటో చాటుకుంది. మిక్సెడ్ డబుల్స్‌లో వరుసగా కప్పులు గెలుచుకుంటోంది. 
 
టెన్నిస్‌తో పాటు అప్పడప్పుడూ ర్యాంప్ వాక్‌లు చేయడం సానియా స్పెషాలిటీ. సినిమాల్లో చేసేందుకు ఓకే అనాలే కానీ.. ఆఫర్స్ ఇచ్చేందుకు టాలీవుడ్ బాలీవుడ్‌లలో బోలెడు మంది దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎందుకొచ్చిన తంటా అనుకుంటున్న సానియా.. తన  ధ్యాసంతా ఆటపైనే అంటూ కవరింగ్ చేస్తూంటుంది.

Share this Story:

Follow Webdunia telugu