Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సానియా చెల్లెలి నిశ్చితార్థం: డిజైనరీ వేర్స్‌తో అక్కాచెల్లెళ్లు మెరవనున్నారా?

సానియా చెల్లెలి నిశ్చితార్థం: డిజైనరీ వేర్స్‌తో అక్కాచెల్లెళ్లు మెరవనున్నారా?
, బుధవారం, 16 సెప్టెంబరు 2015 (18:24 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. సానియా చెల్లెలు ఆనమ్ మీర్జా వివాహ నిశ్చితార్థం బుధవారం రాత్రి హైదరాబాద్ నగరంలోని ఓ స్టార్ హోటళ్లో వైభవంగా జరుగనుంది. దగ్గరి బంధువులు, 200 మంది స్నేహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. 
 
హైదరాబాదుకు చెందిన అడ్వర్టయిజింగ్ ప్రొఫెషనల్ అక్బర్ రషీద్, సానియా చెల్లెలు ఆనమ్‌లు గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారట. వీరి ప్రేమను ఇరువైపుల పెద్దలూ అంగీకరించడంతో సానియా ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఈ నిశ్చితార్థ వేడుకలో సానియా సిస్టర్స్ డిజైనరీ వేర్‌లో అదిరిపోనున్నారట. 
 
ఇక చెల్లెలి నిశ్చితార్థ వేడుకలో పాల్గొనేందుకే యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న సానియా మీర్జా.. పరుగు పరుగువ అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చింది. పాక్ క్రికెటర్, సానియా భర్త షోయబ్ మాలిక్ కూడా మరదలి నిశ్చితార్థం పనుల్లో బిజీ బిజీ అయిపోయారని తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu