Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్: క్వార్టర్స్‌లోకి సైనా, శ్రీకాంత్ ఎంట్రీ

ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్: క్వార్టర్స్‌లోకి సైనా, శ్రీకాంత్ ఎంట్రీ
, శుక్రవారం, 10 జూన్ 2016 (11:00 IST)
ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భాగంగా భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మెరుగైన ఆటతీరుతో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్‌ కూడా రెండోరౌండ్లో గెలుపొందడం ద్వారా  క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. కాగా యువ షట్లర్లు తన్విలాడ్‌, సమీర్‌వర్మ ప్రీక్వార్టర్స్‌లోనే ఓడి నిరాశపరిచారు. 
 
ఇకపోతే.. లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్యపతక విజేత సైనా మహిళల సింగిల్స్‌ రెండోరౌండ్‌లో 21-12, 21-14తో జిన్‌వీగో (మలేసియా)పై వరుస గేముల్లో గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఇదే విధంగా పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21-19, 21-12తో సోనీ డ్వికుంకొరో (ఇండోనేసియా)పై వరుస గేముల్లో సులభంగా విజయం సాధించాడు. 
 
34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిగేమ్‌ను కష్టపడి గెలిచిన భారత షట్లర్‌ రెండోగేమ్‌ను సులభంగా దక్కించుకుని మ్యాచ్‌ నెగ్గాడు. వరల్డ్‌ నెం 13 శ్రీకాంత్‌ క్వార్టర్స్‌లో కొరియా క్వాలిఫయర్‌ క్వాంగ్‌ హీహియోతో తలపడనున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచిన్‌తో నన్ను పోల్చడమా.. ఆయనెక్కడ.. నేనెక్కడ?: అలిస్టర్ కుక్