Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మారడోనా కావాలనే ఇరికించాడు.. కన్నీటి పర్యంతమైన ఎక్స్ లవర్!

మారడోనా కావాలనే ఇరికించాడు.. కన్నీటి పర్యంతమైన ఎక్స్ లవర్!
, శనివారం, 19 జులై 2014 (14:37 IST)
అర్జెంటీనా ఫుట్ బాల్ మాజీ దిగ్గజం డిగో మారడోనాపై మాజీ ప్రేయసి రోకియో ఒలివా మండిపడింది. తన రింగ్‌ను దోచేసుకుందని మారడోనా ఆరోపిస్తుంటే.. తనను కావాలనే ఇరికిస్తున్నాడని రోకియో కన్నీటి పర్యంతమైంది. మారడోనా తన బంగారు ఆభరణాలను మాజీ ప్రేయసి రోకియో దోచుకెళ్లిందని మారడోనా ఆరోపించిన నేపథ్యంలో.. తాను ఎటువంటి వస్తువులను దొంగిలించలేదని రోకియో చెబుతోంది. 
 
'నేను మారడోనా బంగారు ఆభరణాలను దోచుకెళ్లలేదు. నన్ను కావాలని మారడోనా ఇరికించాడు. నేను అతని వద్ద నుంచి ఎటువంటి వస్తువులు తీసుకెళ్లలేదు' అంటూ రోకియో ఒలివా పేర్కొంది. శుక్రవారం బెయిల్ వచ్చిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..  తనను కావాలనే మారడోనా ఇరికిస్తున్నాడని కన్నీటి పర్యంతమైంది. కాగా రోకియోను శుక్రవారం విచారించిన బ్యూనోస్ ఎయిర్స్ కోర్టు ఆమెకు నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
 
తన బంగారు ఆభరణాలను రోకియో దోచుకెళ్లిందని మారడోనా ఆరోపించడం తెలిసిందే. దీంతో ఆమెకు దుబాయ్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తన విలువైన వస్తువులను రోకియో అపహరించిందని మారడోనా ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu