Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్పెషల్ రూమ్‌లో పీలే‌కు ట్రీట్మెంట్... నేను బాగానే ఉన్నా!

స్పెషల్ రూమ్‌లో పీలే‌కు ట్రీట్మెంట్... నేను బాగానే ఉన్నా!
, శుక్రవారం, 28 నవంబరు 2014 (11:27 IST)
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్యంపై అనేక పుకార్లు వస్తున్నాయి. అయితే, ఈ వందతులను ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతానికి తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు 74 యేళ్ళ పీలే ప్రకటించారు. గత కొన్ని రోజులుగా మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్ వ్యాధితో బాధపడుతున్న పీలే తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు వార్తలు వచ్చాయి. వీటిపై ఆయన స్పందించారు. 
 
సావుపాలోలోని ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్‌లో నేను చికిత్స పొందుతున్నా. వ్యక్తిగత కారణంగా నేను ఆసుపత్రిలోని ఓ ప్రత్యేక రూంలో ఉంటున్నా. నన్ను చూడటానికి వస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు. అభిమానుల అండతో నేను వ్యాధి నుంచి త్వరలోనే కోలుకుంటా. నేను ప్రశాంత వాతావరణంలో చికిత్స తీసుకోవాలనుకుంటున్నా. 
 
మీ ప్రేమాభిమానాలు నాపై ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. రాబోయే కొత్త సంవత్సరంలో కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలు చేసేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నా. డిశ్చార్జీ అనంతరం దీనిని అమలుపరుస్తానని పీలే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu