నేనుండగానే తన జూనియర్‌తో మేరీ కోమ్ ఎఫైర్ పెట్టుకున్నదంటూ ఆమె మాజీ భర్త ఆన్లర్ తీవ్ర ఆరోపణ చేసాడు. అందువల్లనే తమ వైవాహిక బంధం బీటలు వారిందంటూ ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణ చేసాడు. మేరీ కోమ్ బాక్సింగ్ క్రీడలో ప్రపంచ చాంపియన్ అయ్యేందుకు తను అహర్నిశలు పాటుపడ్డాననీ, కానీ మేరీ మాత్రం తనను మోసం చేసిందంటూ సంచలన ఆరోపణలు చేసాడు.
ఐతే మాజీ భర్త ఆరోపణలపై మేరీ కోమ్ స్పందించింది. వాస్తవం ఏంటన్నది తను మీడియాలో చెప్పననీ, అసలు ఏం జరిగిందన్నది కోర్టులో పూర్తిగా చెబుతానంటూ వెల్లడించారు. కాగా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా ప్రసిద్ధికెక్కిన మేరీ కోమ్ పైన మాజీ భర్త చేసిన ఆరోపణలతో ఆమె ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజం ఏమిటో తెలియకుండా ఓ నిర్ణయానికి రావద్దంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.