Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీటీఎల్‌: పురుషుల సింగిల్స్‌లో మోన్ఫిల్స్-థామస్ బెర్డిచ్!

ఐపీటీఎల్‌: పురుషుల సింగిల్స్‌లో మోన్ఫిల్స్-థామస్ బెర్డిచ్!
, శుక్రవారం, 28 నవంబరు 2014 (14:10 IST)
ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)కు రంగం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక లీగ్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. భారత్‌కు చెందిన ఇండియన్ ఏసెస్, సింగపూర్ స్లామర్స్ మధ్య మనీలాలో జరిగే మ్యాచ్‌తో లీగ్ ప్రారంభం కానుంది. 
 
తొలుత పురుషులు సింగిల్స్‌లో గేల్ మోన్ఫిల్స్ (ఇండియన్ ఏసెస్), థామస్ బెర్డిచ్ తలపడనుండగా, ఆ వెంటనే జరిగే మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ (ఏసెస్).. డానియెల హంతుచోవాతో బరిలోకి దిగనుంది. 
 
ఇక డబుల్స్‌లో ఏసెస్ జోడీ రోహన్ బోపన్న, మోన్ఫిల్స్.. బ్రూనో సోర్స్, లీటన్ హెవిట్ ద్వయాన్ని ఢీకొననుంది. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో బోపన్నతో జోడీ కట్టనున్న సానియా మీర్జా.. హంతుచోవా, సోర్స్‌తో పోటీపడనుంది.

Share this Story:

Follow Webdunia telugu