Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పల్టీ కొట్టాడు.... ప్రాణాలు కోల్పోయాడు.. మిజోరం ప్లేయర్ పాపం!

పల్టీ కొట్టాడు.... ప్రాణాలు కోల్పోయాడు.. మిజోరం ప్లేయర్ పాపం!
, మంగళవారం, 21 అక్టోబరు 2014 (13:26 IST)
జర్మనీ లెజెండరీ ఆటగాడు మిరోస్లావ్‌ క్లోజ్‌ చేసే విన్యాసాలు అంతా ఇంతా కాదు. గోల్ కొట్టేస్తే చాలు.. అతను వేసే సోమర్‌సాల్ట్‌ (పల్టీ) విన్యాసాలకు ఆశ్చర్యపోని అభిమానులుండరంటే నమ్మితీరాల్సిందే. 
 
కానీ, క్లోజ్‌ విన్యాసాన్ని అనుకరించబోయి ప్రాణాలు కోల్పోయాడు. మిజోరం ప్రీమియర్‌ లీగ్‌ (ఎమ్‌పీఎల్‌)లో భాగంగా గత మంగళవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో బెత్లెహామ్‌ క్లబ్‌ మిడ్‌ఫీల్డర్‌ పీటర్‌ బియాక్సాంగ్జౌలా గోల్‌ చేశాడు. ఆ ఆనందంలో గాల్లోకి పల్టీలు కొట్టాడు. రెప్పపాటులో ఓ పల్టీ కొట్టిన అతను మరో పల్టీ పూర్తయ్యేలోపే మైదానంలో కుప్పకూలాడు. 
 
అపస్మారక స్థితికి చేరుకున్న పీటర్‌ను సహచరులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. సీటీ స్కాన్‌లో పీటర్‌ వెన్నుపూసకు తీవ్ర గాయాలైనట్టు తేలింది. దీంతో 23 ఏళ్ల మిడ్‌ఫీల్డర్‌ను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 
 
ఐసీయూలో ఐదు రోజులు చికిత్స పొందిన పీటర్‌ ఆదివారం మృతిచెందాడు. కాగా, చికిత్స పొందుతున్న సమయంలోనే పీటర్‌ తన కళ్లను దానం చేసేందుకు అంగీకరించినట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu