Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రొనాల్డిన్హోకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏం జరిగింది?

రొనాల్డిన్హోకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏం జరిగింది?
, శనివారం, 3 అక్టోబరు 2015 (12:08 IST)
గోల్ పోస్ట్‌పై మెరుపు దాడులు చేయడంలో రాణించే బ్రెజిల్ ఆటగాడైన రొనాల్డిన్హో రెండుసార్లు ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత సాకర్ ప్లేయర్ అయిన రొనాల్డిన్హో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రొనాల్డిన్హో ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. తన తల్లి అలిగ్రే జన్మదిన వేడుకల కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
 
ప్రమాదం జరిగిన సమయంలో రొనాల్డిన్హో డ్రైవర్ కారు నడుపుతున్నాడు. ఈ ప్రమాదం నుంచి రొనాల్డిన్హో క్షేమంగా బయటపడటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్రెజిల్ ఆటగాడైన రొనాల్డిన్హో రెండుసార్లు ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్ల గుండెల్లో గుబులు పుట్టించే రొమాల్డిన్హో మ్యాచ్‌ల సందర్భంగా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తాడు.  

Share this Story:

Follow Webdunia telugu