Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పురుషుల వాలీబాల్ మ్యాచ్‌కెళ్లిన పాపం.. జైలులోనే?

పురుషుల వాలీబాల్ మ్యాచ్‌కెళ్లిన పాపం.. జైలులోనే?
, గురువారం, 16 అక్టోబరు 2014 (18:37 IST)
పురుషుల వాలీబాల్ మ్యాచ్‌కెళ్లిన పాపానికి ఓ మహిళ జైలు జీవితం కొనసాగిస్తోంది. ఇరాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరాన్ మహిళలపై ఆంక్షలు కఠినంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో బ్రిటీష్-ఇరానియన్ మహిళ ఘోంచే ఘవామీ పురుషుల వాలీబాల్ మ్యాచ్‌కు హాజరవడమే కాక, "మీరు కూడా వాలీబాల్ మ్యాచ్‌లకు వెళ్ళగలగాలి" అని ఇతర మహిళలకు పిలుపునిచ్చింది. అదే ఆమె చేసిన నేరం! వెంటనే ఇరాన్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రిమాండ్ ఖైదీగా ఆమెను ఇప్పటికే మూడు నెలలకు పైగా జైల్లో ఉంచారు. 
 
కాగా లా గ్రాడ్యుయేట్ అయిన ఘవామీ టెహ్రాన్‌లోని ఆజాదీ స్టేడియంలో జరుగుతున్న ఇరాన్-ఇటలీ పురుషుల వాలీబాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్ళింది. ఇరాన్‌లో క్రీడాపోటీల సందర్భంగా మహిళలు పురుష ప్రేక్షకులతో కలిసి కూర్చోవడం నిషిద్ధం. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు. 
 
గతవారం ఆమె జైలులో నిరసన దీక్ష చేపట్టారు. ఘవామీ వ్యవహారంపై స్పందించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆమెను విడుదల చేయాలంటూ సంతకాల సేకరణ చేపట్టింది.

Share this Story:

Follow Webdunia telugu