Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియురాలి హత్య కేసులో బ్లేడ్ రన్నర్‌ పిస్టోరియస్‌కు ఐదేళ్ళ జైలు!

ప్రియురాలి హత్య కేసులో బ్లేడ్ రన్నర్‌ పిస్టోరియస్‌కు ఐదేళ్ళ జైలు!
, మంగళవారం, 21 అక్టోబరు 2014 (15:32 IST)
తన ప్రియురాలి హత్య కేసులో ప్రఖ్యాత బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్‌కు ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. గత యేడాది ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేయసి రీవా స్టీన్ క్యాంప్‌ను హత్య చేశాడన్న కేసులో... పిస్టోరియన్‌కు న్యాయస్థానం ఐదేళ్ల శిక్షను ఖరారు చేసింది. 
 
తన గర్ల్ ఫ్రెండ్ టాయ్ లెట్‌లో ఉండగా మూసిన తలుపులో నుంచే పిస్టోరియన్ షూట్ చేసినట్టు అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే, అది పొరపాటున సంభవించిందని కోర్టుకు మొరపెట్టుకున్నాడు. ఘటన ఏ విధంగా జరిగినా... హత్యగానే భావించాల్సి వస్తుందని కోర్టు పేర్కొంటూ పిస్టోరియస్‌ను దోషిగా ప్రకటించి ఐదేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
 

Share this Story:

Follow Webdunia telugu