Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్ట్రేలియన్ ఓపెన్ : ఫైనల్లో సెరెనా- మరియా షరపోవా ఢీ!

ఆస్ట్రేలియన్ ఓపెన్ : ఫైనల్లో సెరెనా- మరియా షరపోవా ఢీ!
, గురువారం, 29 జనవరి 2015 (11:49 IST)
ఆస్ట్రేలియన్ ఓపెన్‌ ఫైనల్లో అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్- రష్యా బ్యూటీ మరియా షరపోవాల మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లోకి విలియమ్స్ సిస్టర్ సెరెనా విలియమ్స్ అడుగు పెట్టింది. 
 
కొద్దిసేపటి క్రితం ముగిసిన రెండో సెమీ ఫైనల్‌లో మ్యాడిసన్ కీస్‌పై సెరెనా విజయం సాధించింది. వరుస సెట్లలో 7-6, 6-2 స్కోరుతో సునాయాసంగా నెగ్గిన సెరెనా విలియమ్స్, ఫైనల్‌లో రష్యా బ్యూటీ మారియా షరపోవాతో పోరుకు రెడీ అవుతోంది.
 
గురువారం జరిగిన తొలి సెమీఫైనల్‌లో షరపోవా, మకరోవాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఎనిమిదేళ్ల క్రితం ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సెరెనా, షరపోవాలు టైటిల్ కోసం తలపడ్డారు.
 
నాటి పోటీలో షరపోవాపై సెరెనా విజయం సాధించి టైటిల్‌ను ఎదురవేసుకుపోయింది. మరి ఈ సారి ఫైనల్‌లో ఎవరు గెలుస్తారో, టైటిల్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu