Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింధు విజయానందంలో సైనా గొడవెందుకు?: గోపీచంద్

సింధు విజయానందంలో సైనా గొడవెందుకు?: గోపీచంద్
, మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (18:30 IST)
బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కోచ్‌ను మార్చేయడంపై వ్యాఖ్యానించేందుకు ఆల్ ఇంగ్లండ్ మాజీ ఛాంపియన్, కోచ్ పుల్లెల గోపిచంద్ నిరాకరించారు. ప్రస్తుతానికి తాను పీవీ సింధు సాధించిన విజయాన్ని ఆస్వాదిస్తున్నానని.. ఈ పరిస్థితుల్లో సైనా నెహ్వాల్ గొడవెందుకని ప్రశ్నించారు.
 
తన శిష్యరికంలో రోజు రోజుకీ పురోగతి సాధిస్తున్న సింధు విజయం సాధించడం తనను అమితానందానికి గురి చేసిందని గోపీచంద్ తెలిపారు. సింధు ప్రత్యర్థులను మట్టికరిపించడం వెనుక అంతులేని శ్రమ దాగుందని ఆయన కొనియాడారు. రోజు రోజుకీ ఆటలో పురోగతి సాధిస్తున్న సింధు మరిన్ని విజయాలు సాధిస్తుందని గోపీచంద్ ఆకాంక్షించారు.

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో క్యాంస పతకాన్ని గెలుచుకున్న తెలుగుతేజం పీవీ సింధుకు హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు.  

Share this Story:

Follow Webdunia telugu