Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రియో ఒలింపిక్స్ : భారత్ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా రెహమాన్‌

Advertiesment
AR Rahman
, గురువారం, 12 మే 2016 (19:12 IST)
రియో ఒలింపిక్స్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఆస్కార్‌ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్‌ రెహమాన్‌ ఎంపికయ్యారు. భారత తరపున గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికైన వారిలో రెహ్మాన్ నాలుగో సెలెబ్రిటీ కావడం గమనార్హం. 
 
ఇదిలావుండగా, తనను రాయబారిగా నియమిస్తూ ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ) చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తూ రెహమాన్‌ లేఖ పంపినట్లు అసోసియేషన్‌ వెల్లడించింది. గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఉండడం గర్వకారణమని రెహమాన్‌ లేఖలో తెలిపారు. 
 
కాగా, భారత్ తరపున ఇప్పటికే రియో ఒలింపిక్స్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్లుగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌, ఒలింపిక్‌ బంగారు పతక గ్రహీత అభినవ్‌ బింద్రా, క్రికెట్‌ దిగ్గజం భారతరత్న సచిన్‌ టెండూల్కర్‌లు ఎంపికయ్యారు. దీనిపై స్పందిస్తూ ఒలింపిక్స్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా రెహమాన్‌కు సాదర స్వాగతం పలుకుతున్నామని ఐఓఏ సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రీతి జింటా కోచ్‌పై ఫైర్ అయ్యిందా..? ఇందులో ఎంతవరకు నిజముంది?