Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనా గెలుపును ఐస్‌క్రీమ్‌తో సెలబ్రేట్ చేశా: సైనా

చైనా గెలుపును ఐస్‌క్రీమ్‌తో సెలబ్రేట్ చేశా: సైనా
, గురువారం, 20 నవంబరు 2014 (14:35 IST)
చైనా టైటిల్ గెలవడం పట్ల భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ హర్షం వ్యక్తం చేసింది. ఈ టైటిల్ నెగ్గడాన్ని జీవితంలో మరిచిపోనని, ఇది తనకు స్పెషల్ టైటిల్ అని చెప్పుకొచ్చింది. 1991కి తర్వాత చైనా టైటిల్ నెగ్గడం ఎంతో సంతోషాన్నిచ్చిందని సైనా నెహ్వాల్ వెల్లడించింది. 
 
ఈ విజయాన్ని జస్ట్ వెన్నిలా ఐస్ క్రీమ్‌తో సెలబ్రేట్ చేశానని సైనా చెప్పుకొచ్చింది. తదుపరి హాంకాంగ్ టోర్నీపై కన్నేశానని, తనకు తల్లిదండ్రుల మద్దతుతో పాటు కోచ్ విమల్ ట్రైనింగ్ అన్ని విధాలా సహకరించిందని చెప్పుకొచ్చింది.
 
అలాగే మాజీ కోచ్ పుల్లెల గోపిచంద్ గురించి సైనా మాట్లాడుతూ.. ఆయన బర్త్ డేకి విష్ చేశానని, భారత్‌లో హెడ్ కోచ్ అయిన గోపిచంద్‌కు భారీ విజయాలు దక్కాలని ఆశించింది.  

Share this Story:

Follow Webdunia telugu