Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హాలె టెన్నిస్ టోర్నీ: మేయర్‌పై లిటెన్ హెవిట్ గెలుపు!

హాలె టెన్నిస్ టోర్నీ: మేయర్‌పై లిటెన్ హెవిట్ గెలుపు!
డిఫెండింగ్ ఛాంపియన్ లిటన్ హెవిట్ హాలె టెన్నిస్ టోర్నమెంట్లో రాణించాడు. రెండో రౌండ్లో లక్కీ లాసెర్ లియోనార్డొ మేయర్‌‌పై ధీటుగా రాణించిన హెవిట్ సునాయాసంగా గెలిచాడు. ఆద్యంతం మెరుగైన షాట్లతో ప్రత్యర్థిని కట్టడి చేసిన హెవిట్ సునాయాసంగా మూడో రౌండ్లోకి ప్రవేశించాడు.

ఈ సందర్భంగా హెవిట్ మాట్లాడుతూ.. తొలి రౌండ్లో గెలుపొందడం హ్యాపీగా ఉంది. రెండో రౌండ్లో ఆండ్రియా సెప్పితో బరిలోకి దిగుతున్నా. రెండో రౌండ్లో మెరుగ్గా రాణించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పాడు.

కాగా, తొలి రౌండ్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనలిస్ట్ రోజర్ ఫెదరర్‌పై విజయం సాధించిన హెవిట్ సెప్పిపై సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంటాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. మాజీ ప్రపంచ నెంబర్ వన్ ఫెదరర్‌ఫై హెవిట్ 6-2, 6-3 పాయింట్ల తేడాతో గెలవడంతో స్విజ్ మాస్టర్ హాలె టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu