Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్పోర్ట్స్ అవార్డు వేడుకలకు హాలీవుడ్ స్టార్ కెవిన్ స్పాసీ..!!

స్పోర్ట్స్ అవార్డు వేడుకలకు హాలీవుడ్ స్టార్ కెవిన్ స్పాసీ..!!
FILE
హాలీవుడ్ ఫిల్మ్ స్టార్ కెవిన్ స్పాసీ స్పోర్ట్స్ అవార్డు వేడుకలలో క్రీడా ప్రేమికులను తన ఆటతో అలరించనున్నాడు. బుధవారం అబుదాబీలో నిర్వహించనున్న ఈ ప్రపంచ క్రీడా అవార్డుల ప్రదాన ఉత్సవంలో కెవిన్‌తోపాటు హగ్ గ్రాంట్ మరియు క్లైవ్ ఓవెన్ లాంటి తారలు సైతం పాల్గోనున్నారు.

గత సంవత్సరం క్రీడలలో అసమాన ప్రదర్శనతో ఆకట్టుకుని ఉత్తమ క్రీడాకారులకు 2010 సంవత్సరానికిగానూ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. వీరిలో ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ బాక్సర్ విటాలీ క్లిట్స్‌చోకో, జర్మనీ మహిళా ఫుట్‌బాల్ కోచ్ సిల్వియా నైద్, అమెరికాకు చెందిన 400 మీటర్ల ప్రపంచ ఛాంపియన్ సన్యా రిచర్డ్స్ తదితరులున్నారు.

ఈ క్రీడా అవార్డుల వేడుకలలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలువురు క్రికెటర్లు సైతం అలరించనున్నారు. వీరిలో ఆండ్రూ ఫ్లింటాఫ్, ఇంగ్లండ్‌కు చెందిన మిచాయేల్ వాగన్, దక్షిణాఫ్రికాకు చెందిన షాన్ పొల్లాక్, ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ వా తదితరులు ఉన్నారు. అలాగే అమెరికాకు చెందిన యేల్ మాక్లా‌చలన్ (డెస్పరేట్ హౌస్‌వైవ్‌స్ చిత్రంలోని స్టార్), అవతార్ చిత్రంలో ట్రూడీ ఛాకోన్‌గా నటించిన మిచెల్లే రోడిగ్వెజ్ తదితరులు సైతం ఈ క్రీడా అవార్డుల ఉత్సవాలకు హాజరుకానున్నారు.

Share this Story:

Follow Webdunia telugu