Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమైక్యాంధ్ర పోరాటం: బీచ్ ఫుట్‌బాల్ పోటీలు వాయిదా

సమైక్యాంధ్ర పోరాటం: బీచ్ ఫుట్‌బాల్ పోటీలు వాయిదా
రాష్ట్రంలోని విశాఖపట్నంలో జరగాల్సిన బీచ్ ఫుట్‌బాల్ పోటీలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో జరుగుతున్న సమైక్యాంధ్ర పోరాటంతో ఈ పోటీలను వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ బీచ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏపీబీఎఫ్ఏ) కార్యదర్శి ఎస్ అప్పారావు విలేకరులతో చెప్పారు.

ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన ఈ బీచ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ను.. జనవరి 27వ తేదీ నుంచి 30వరకు నిర్వహించాల్సిందిగా నిర్ణయించామని ఆయన తెలిపారు. ప్లడ్ లైట్ల కింద జరిగే ఈ చాంపియన్‌షిప్‌కు దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి మెమోరియల్ చాంపియన్‌షిప్ పేరిట నిర్వహించాలని భావిస్తున్నట్లు అప్పారావు అన్నారు.

దాదాపు 24 జట్లు పాల్గొంటున్న ఈ పోటీల్లో 14 పురుషులు, 10 మహిళల జట్లు పాల్గొంటాయని అప్పారావు వెల్లడించారు. తొలుత ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఈ పోటీలు నాలుగోసారిగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu