Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లడఖ్‌లో 222 కి.మీటర్ల లాంగ్ ఎవరెస్ట్ మారథాన్ రేసు!

లడఖ్‌లో 222 కి.మీటర్ల లాంగ్ ఎవరెస్ట్ మారథాన్ రేసు!
లడఖ్‌లో ఆగస్టు 11వ తేదీ నుంచి 222 కిలోమీటర్ల టఫెస్ట్ అల్ట్రా మారథాన్ ప్రారంభం కానుంది. చల్లటి ఎడారి లడఖ్‌లో ఆక్సిజన్ 40 శాతం తక్కువ గల ప్రాంతంలో ఎవరెస్ట్ మారథాన్ రేస్ జరుగనుంది. ఖర్డుంగ్లాలో (180380 అడుగులు) ప్రారంభమయ్యే ఈ ఎవరెస్ట్ మారథాన్ తంగ్లాగ్లా (17583 అడుగులు) వద్ద పూర్తవుతుంది.

ఈ రేసులో పాల్గొనే వారికి ఫిట్‌నెస్ పరీక్షలు ఉంటాయని రేస్ డైరక్టర్, కో-మెడికల్ డైరక్టర్ ఆఫ్ హిమాలయ క్లబ్ డాక్టర్ రాజత్ చౌహాన్ వెల్లడించారు. ఈ మారథాన్‌లో పాల్గొనే వారికి ముఖ్యంగా ఫిట్‌నెస్ అవసరమన్నారు. ఆగస్టు 11 నుంచి 14వ తేదీవరకు నాలుగు రోజుల పాటు సాగే మారథాన్‌కు ప్రభుత్వం, క్రీడాశాఖ అన్నివిధాలా సహకరిస్తామని హమీ ఇచ్చిందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu