Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరి కొద్దిరోజులు టెన్నిస్‌కు దూరం : షరపోవా

మరి కొద్దిరోజులు టెన్నిస్‌కు దూరం : షరపోవా
, శుక్రవారం, 3 అక్టోబరు 2008 (19:11 IST)
గాయం కారణంగా తాను మరికొంతకాలం టెన్నిస్‌కు దూరంగా ఉండనున్నట్టు మారియా షరపోవా పేర్కొంది. గాయం నయమై పూర్తి ఫిట్‌నెస్ సాధించాకే తాను మైదానంలో అడుగుపెడుతానని ఈ సందర్భంగా షరపోవా తెలిపింది.

తన వ్యక్తిగత వెబ్‌సైట్‌లో షరపోవా ఓ ప్రకటన చేస్తూ గాయం కారణంగానే తాను త్వరలో జరగనున్న ఖతార్ ఓపెన్ నుంచి కూడా వైదొలుగుతున్నట్టు తెలిపింది. పూర్తి ఫిట్‌నెస్ సాధించే దిశగా ఈ సీజన్‌లో తాను ఆడడం అనుమానమేనంటూ షరపోవా పేర్కొంది.

భుజం గాయం కారణంగా కొంతకాలంగా టెన్సిస్‌కు దూరంగా ఉంటూ వస్తోన్న షరపోవా ఇటీవల జరిగిన బీజింగ్ ఒలింపిక్స్, అమెరికా ఓపెన్‌లతో సహా ఇతర టోర్నమెంట్లలోనూ ఆడకపోవడం తెలిసిందే.

గతంలో ఆస్ట్రేలియా సిరీస్ గెలుచుకోవడం ద్వారా ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని సాధించిన ఈ రష్యా సుందరి అటుపై వింబుల్డన్ పోటీల్లో రెండో రౌండ్లోనే వెనుదిరగడం అటుపై గాయాల బెడదతో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో బాగా వెనుకబడడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu