Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ సాకర్ ఫుట్‌బాల్: కివీస్‌పై ఇంగ్లండ్ విజయం

ప్రపంచ సాకర్ ఫుట్‌బాల్: కివీస్‌పై ఇంగ్లండ్ విజయం
మహిళల ప్రపంచ సాకర్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో గ్రూప్-2లో మ్యాచ్‌లలో భాగంగా ఇంగ్లండ్ తన ప్రత్యర్థి న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలోనే కివీస్ క్రీడాకారిణులు ఇంగ్లండ్‌పై దాడులకు ఉపక్రమించారు. మ్యాచ్ 18వ నిమిషంలో సారా గ్రెగోరియస్ చేసిన గోల్‌తో న్యూజిలాండ్‌కు 1-0 ఆధిక్యం లభించింది. ప్రథమార్థం ముగిసే వరకూ మరో గోల్ నమోదుకాలేదు. ద్వితీయార్థంలో ఇంగ్లాండ్ ఎదురుదాడికి దిగి గోల్స్ చేయడంతో విజయం సులభమైంది.

అయితే, ఇంగ్లండ్ క్రీడాకారిణులను ఎదుర్కొనేందుకు కివీస్ క్రీడాకారిణులు ఎంతగానే శ్రమించినప్పటికీ... ఫలితం లేకుండా పోయింది. దీంతో 63వ నిమిషంలో ఇంగ్లండ్ గోల్ సాధించింది. ఆ తర్వాత పోరు హోరాహోరీగా సాగినప్పటికీ గోల్స్ కోసం జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. డ్రా అనివార్యమనుకున్న తరుణంలో జెస్సికా క్లార్క్ కీలకమైన గోల్ చేసి ఇంగ్లండ్‌ జట్టుకు విజయాన్ని అందించారు.

Share this Story:

Follow Webdunia telugu