Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుబాయ్ ఓపెన్: సోమదేవ్‌పై గెలిచిన రోజర్ ఫెదరర్!

దుబాయ్ ఓపెన్: సోమదేవ్‌పై గెలిచిన రోజర్ ఫెదరర్!
FILE
భారత యువ టెన్నిస్ స్టార్ సోమదేవ్ దేవ్‌వర్మన్‌పై స్విట్జర్లాండ్ టెన్నిస్ మాస్టర్ రోజర్ ఫెదరర్ గెలుపొందాడు. టెన్నిస్‌లో ఓనమాలు నేర్చుకుంటున్న సోమదేవ్‌ను 75 నిమిషాల పాటు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఫెదరర్ ఓడించాడు.

ఫెదరర్‌తో జరిగిన మ్యాచ్‌లో బాగా శ్రమించినప్పటికీ సోమదేవ్ 6-3, 6-3 వరుస సెట్ల తేడాతో ఓడిపోయాడు. తద్వారా స్విజ్ మాస్టర్ అంతటి టెన్నిస్ కింగ్‌తో ఆడిన కొత్త అనుభూతిని సోమదేవ్ పొందగలిగాడు.

రోజర్ ఫెదరర్‌తో తలపడే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషపడిన సోమదేవ్, వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో ఫెదరర్‌తో ధీటుగా ఆడగలిగాడు. మూడు వారాల క్రితం ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో సోమదేవ్ ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu