Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుబాయ్ ఓపెన్: సెమీఫైనల్లోకి ఫెదరర్, నోవాక్ జకోవిచ్!

దుబాయ్ ఓపెన్: సెమీఫైనల్లోకి ఫెదరర్, నోవాక్ జకోవిచ్!
FILE
దుబాయ్‌లో జరుగుతున్న టెన్నిస్ టోర్నమెంట్లో స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇప్పటికే 6 సార్లు దుబాయ్ టైటిళ్లను గెలుచుకున్న రోజర్ ఫెదరర్‌తో పాటు సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్‌‌లు కూడా సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు.

మొట్టమొదటి సారిగా ఉక్రెయిన్ క్రీడాకారుడు సెర్జీ స్టావోస్కీతో తలపడిన రోజర్ ఫెదరర్ 6- 3, 6- 4 విజయం సాధించి, సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. అలాగే మరో క్వార్టర్ ఫైనల్లో ఫ్లోరియన్ మేయర్‌పై నెగ్గిన జకోవిచ్, సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. మేయర్‌పై గట్టిపోటీని ప్రదర్శించిన జకోవిచ్ 7- 5, 6- 4 తేడాతో విజయం సాధించాడు.

ఇకపోతే.. ఫ్రాన్స్ క్రీడాకారుడు రిచర్డ్ గాస్క్వెట్ తన సహచరుడు సీమోన్‌ను 5- 7, 6- 2, 6- 4 తేడాతో ఓడించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. తద్వారా సెమీఫైనల్లో రోజర్ ఫెదరర్‌తో గాస్క్వెట్ తలపడనున్నాయి. కాగా, ఫెదరర్‌ ఆటతీరుతో గాస్క్వెట్‌కు గట్టిపోటీ తప్పదని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే సెర్బియా స్టార్ జకోవిచ్ తన సెమీఫైనల్ పోరులో థామస్ బెడ్రిచ్‌తో తలపడనున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu