Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుబాయ్ ఓపెన్ టైటిల్ పోరు: రోజర్ ఫెదరర్‌తో జకోవిచ్ ఢీ!

దుబాయ్ ఓపెన్ టైటిల్ పోరు: రోజర్ ఫెదరర్‌తో జకోవిచ్ ఢీ!
FILE
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్ పోరులో స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ నోవాక్ జకోవిచ్ తలపడనున్నాడు. థామస్ బెడ్రిచ్‌తో నాటకీయంగా ముగిసిన సెమీఫైనల్లో నోవాక్ జకోవిచ్ విజయం సాధించడం ద్వారా రోజర్ ఫెదరర్‌తో టైటిల్ పోరుకు సిద్ధమయయ్యాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న ఊపుతో ఉన్న నోవాక్ జకోవిచ్ ఈ ఏడాది టెన్నిస్ సీజన్‌లో దుబాయ్ ఓపెన్ విజేతగా నిలవాలని తహతహలాడుతున్నాడు. ఈ క్రమంలో మూడో సీడ్ థామస్ బెడ్రిచ్‌ను 6-7 6-2 4-2 తేడాతో ఓడించిన జకోవిచ్ ఫెదరర్‌తో సమరానికి సై అంటున్నాడు.

అయితే అన్‌సీడెడ్ రిచర్డ్ గాస్క్వెట్‌పై 6-2 7-5 తేడాతో గెలిచిన రోజర్ ఫెదరర్ జకోవిచ్‌పై గట్టిపోటీని ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఫైనల్ పోరులో జకోవిచ్‌ను మట్టికరిపించడం ద్వారా దుబాయ్ ఓపెన్ టైటిల్ గెలుచుకోవాలని రోజర్ ఫెదరర్ భావిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu