Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తొలిసారి టాప్-30లో స్థానం పొందనున్న సానియా

తొలిసారి టాప్-30లో స్థానం పొందనున్న సానియా
న్యూఢిల్లీ (ఏజెన్సీ) , ఆదివారం, 5 ఆగస్టు 2007 (20:02 IST)
భారత టెన్నీస్ సంచలనం, హైదరాబాద్ క్రీడాకారిణి సానియా మీర్జా తన కెరీర్‌లో సాధించని అత్యుత్తమ ర్యాంకును సాధించనుంది. ప్రపంచ టెన్నీస్ సమాఖ్యం సోమవారం వెల్లడించనున్న తాజా ర్యాకింగ్స్‌లో సానియా టాప్-30లో స్థానం పొందనుంది. రెండేళ్ళ క్రితం సానియా అత్యుత్తంగా 31వ ర్యాంకును సాధించింది. అయితే ఇటీవల జరిగిన అక్యూరా క్లాసిక్, సిన్సినాటీ, వెస్ట్ బ్యాంక్ టోర్నీల్లో సానియా అద్భుతంగా రాణించిన సంగతి తెల్సిందే.

దీంతో ఆమె ర్యాంకు గణనీయంగా మెరుగుపడనుంది. అక్యురా క్లాసిక్ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్‌లో సానియా ప్రపంచ నెంబర్ వన్ సీడ్ మరియా షరపోవా చేతిలో ఓడినప్పటికీ తన ఖాతాలో 110 పాయింట్లను జమ చేసుకుంది. దీంతో ప్రస్తుతం 31వ ర్యాంకులో ఉన్న సానియా టాప్-30లో తొలిసారి స్థానం దక్కించుకోనుంది.

Share this Story:

Follow Webdunia telugu