Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధిస్తా: కిమ్ క్లియస్టర్స్

టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధిస్తా: కిమ్ క్లియస్టర్స్
డబ్ల్యూటీఏ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో కిమ్ క్లియస్టర్స్ అగ్రస్థానంలో నిలుస్తానంటోంది. ప్యారిస్-కోబర్టిన్ టోర్నమెంట్ సెమీఫైనల్ వరకు పోరాడిన కిమ్ క్లియస్టర్స్, త్వరలో అగ్రస్థానాన్ని సాధిస్తానని చెబుతోంది. డెన్మార్క్‌కు చెందిన కరోలిన్ వోజ్నియాకీ ఈ టోర్నీకి దూరం కావడంతో కియస్టర్స్ తప్పకుండా టాప్ ర్యాంకును సొంతం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేస్తోంది.

తాను ఇంతవరకు గ్రాండ్ స్లామ్ నెగ్గకపోయినా, అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి నెంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంటానని కిమ్ క్లియస్టర్స్ చెబుతోంది. 2005లో జరిగిన యూఎస్ ఓపెన్, 2009, 2010, 2011 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మెరుగ్గా రాణించినా గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకోలేకపోయిన క్లియస్టర్స్, డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో మాత్రం అగ్రస్థానంలో నిలుస్తానని చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu