ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో స్పెయిన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. శనివారం నెదర్లాండ్స్‌పై 3-1 పాయింట్ల తేడాతో నెగ్గిన స్పెయిన్ ఫైనల్ పోరీలో ఆస్ట్రేలియాలో అమీతుమీ తేల్చుకోనుంది. న్యూజిలాండ్‌పై 2-1 తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా స్పెయిన్‌ను చిత్తుగా ఓడించాలనుకుంటోంది.
ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ టోర్నీలో జర్మనీ పాకిస్థాన్‌ను 5-0 పాయింట్ల తేడాతో ఓడించగా, దక్షిణ కొరియా గ్రేట్ బ్రిటన్ను 4-3 పాయింట్ల తేడాతో మట్టికరిపించింది.
కాగా పూర్తి ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా లండన్ ఒలింపిక్స్‌కు ముందు మంచి రికార్డును కలిగివుంది. పురుషుల హాకీ జట్టు 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అలాగే 2004లో స్పెయిన్‌ను ఓ మ్యాచ్‌లో మట్టికరిపించడం గమనార్హం.