Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రిస్మస్ తరువాత టైగర్ ఉడ్స్‌కు ఎలిన్ టాటా..!!

క్రిస్మస్ తరువాత టైగర్ ఉడ్స్‌కు ఎలిన్ టాటా..!!
FILE
వివాహేతర సంబంధాల భాగోతంతో ప్రపంచమంతటా అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగా మారిన అమెరికన్ గోల్ఫ్ స్టార్ టైగర్ ఉడ్స్‌కు అతని భార్య ఎలిన్ క్రిస్మస్ అనంతరం గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. తనతో వివాహ బంధాన్ని నిలుపుకునేందుకు టైగర్ గోల్ఫ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ.. భర్తను క్షమించేందుకు ఎలిన్ మాత్రం సిద్ధంగా లేనట్లు ఆమె సన్నిహిత వర్గాల సమాచారం.

అంతేగాకుండా ఎలిన్‌కు ఇప్పుడో కొత్త భయం పట్టుకుందట. అదేంటంటే.. ఇప్పటికే టైగర్‌తో సంబంధాలున్నాయంటూ పోర్న్ స్టార్స్ (నీలిచిత్రాల హీరోయిన్లు)తో పాటు పలువురు మహిళలు బహిరంగంగా ఒప్పుకోవటంతో, తన భర్తకు ఎయిడ్స్ లాంటి లైంగిక వ్యాధులు సోకి ఉంటాయేమోనని ఆమె వణికిపోతోందట.

ఉడ్స్ సెక్స్‌లో పాల్గొనేటప్పుడు కండోమ్ ధరించేవాడు కాదంటూ అతడితో రాసలీలలు నెరపిన కాక్‌టెయిల్ వెయిట్రస్ మిండీ లాటన్‌తోపాటు పలువురులేడీ బాంబ్‌లు ఇటీవల వెల్లడించటంతో ఎలిన్‌లో సందేహం మొదలయ్యిందట. దీంతో 29 ఏళ్ల ఎలిన్ తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు ఆమె సన్నిహితులతో వాపోతోందట. కాగా... విచ్చలవిడి శృంగారానికి పాల్పడ్డ ఉడ్స్ ఆరోగ్య స్థితిపై ఆరోగ్య నిపుణులు కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కూడా..!

ఇదిలా ఉంటే.. టైగర్ ఉడ్స్‌తో విడాకుల కోసం ఎలిన్ ఇప్పటికే లాయర్లతో సంప్రదింపులు సాగిస్తోందనీ, ఈ ఏడాది క్రిస్మస్ అనంతరం అతడికి బైబై చెప్పనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్వీడన్ రాజధాని స్టాక్‌హోం దగ్గర్లో ఓ ఎస్టేట్‌ను ఎలిన్ కొనుగోలు చేసిందట. ఇకపోతే.. టైగర్ గోల్ఫ్‌కు విరామం ప్రకటించగానే, ఇన్నాళ్లూ అతడికి స్పాన్సర్లుగా ఉన్న పలు సంస్థలన్నీ మెల్లిగా జారుకుంటుండటం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu