Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్ టోర్నీ టైటిల్

అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్ టోర్నీ టైటిల్
ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భారత్ సంచలనం సృష్టించింది. ఈ టోర్నీలో నిర్ణయాత్మక కీలక పోరులో భారత ప్రధాన క్యూయెస్ట్ పంకజ్ అద్వానీ.. అత్యద్భుత పోరాటాన్ని ప్రదర్శించి డిఫెండింగ్ ఛాంపియన్ మార్క్ రస్సెల్‌పై గెలుపొందాడు. నువ్వా, నేనా అంటూ సాగిన ఈ మ్యాచ్‌లో రస్సెల్‌పై 2030-1253తో అద్వానీ విజయం సాధించాడు.

దీంతో 139 ఏళ్ల భారత బిలియర్డ్స్ చరిత్రలో టైటిల్ వశం చేసుకున్న రెండో ఆటగాడిగా అద్వానీ నిలిచాడు. 1992లో ఈ టైటిల్‌ను భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన గీత్ సేధీ గెలుచుకున్నాడు. అంతకుముందు.. ఈ టోర్నీ సెమీస్‌లో ధృవ సిత్వాలాపై అద్వానీ సంచలన విజయం నమోదు చేశాడు.

దీంతో ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న అద్వానీ.. రస్సెల్‌తో మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. కాగా, లీగ్ మ్యాచ్‌లోనే.. ఈ టోర్నీ నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గీత్ సేధీ వైదొలిగాడు. వాస్తవానికి ఈ టైటిల్‌ను ఎలాగైనా గెలవాలనే.. ధృడసంకల్పంతో.. గీత్‌సేధీ బరిలోకి దిగాడు. కానీ, లీగ్ మ్యాచ్‌లోనే విఫలమయ్యాడు.

Share this Story:

Follow Webdunia telugu