రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో మగళవారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం బులియన్  మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.8,790, ఆర్నమెంట్ బంగారం పది గ్రాములు రూ.8,050 (క్రితం ముగింపులో రూ.  8,070), వెండి కిలో రూ.18,500 మేరకు ధరలు ఉన్నాయి. 
అలాగే.. విజయవాడ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.8,790 (క్రితం ముగింపులో రూ. 8,740), 22  క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.8,250, (క్రితం ముగింపులో రూ.8,250), కిలో వెండి రూ.17,700 (క్రితం ముగింపులో రూ. 17,700)  ఉన్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
ఇకపోతే.. రాజమండ్రి బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.8,850 (క్రితం ముగింపులో రూ.8,850),  ఆర్నమెంట్ బంగారం పది గ్రాములు రూ.8,060 (క్రితం ముగింపులో రూ.8,060), వెండి కేజీ ధర రూ.17,700 (క్రితం ముగింపులో  రూ.17,700) మేర పలికాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. 
తమిళనాడు రాజధాని చెన్నై బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.8,705 (క్రితం ముగింపులో రూ.8,665),  ఆర్నమెంట్ బంగారం (1గ్రా) రూ.807 (క్రితం ముగింపులో రూ.803), కిలో వెండి ధర రూ.17,260 (క్రితం ముగింపులో రూ. 17,235)  మేరకు పలికాయి.