Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

17వేల మార్కు దిగువస్థాయికి పడిపోయిన సెన్సెక్స్

17వేల మార్కు దిగువస్థాయికి పడిపోయిన సెన్సెక్స్
వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. దేశీయ వాటాల ట్రేడింగ్ మందకొడిగా సాగడంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 299 పాయింట్లు నష్టపోయి, 16,867 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ కూడా 94 పాయింట్లు కోల్పోయి, 5,060 పాయింట్ల మార్కును తాకింది.

అమెరికా, ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ క్షీణించడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. అలాగే మదుపుదారులు సైతం కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపకపోవడం సెన్సెక్స్, నిఫ్టీల పతనానికి దారి తీసింది. ఇంకా దేశీయ బ్యాంకింగ్, ఐటీ వాటాల ట్రేడింగ్ ఆశాజనకంగా కొనసాగకపోవడం స్టాక్ మార్కెట్ నష్టాల్లోకూరుకుపోయిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇకపోతే.. ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, ఐటీసీ, జిందాల్ స్టీల్, జేపీ అసోసియేట్స్, లార్సెన్ అండ్ టర్బో, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టపోగా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్‌జీసీ వంటి సంస్థలు లాభపడ్డాయి.

Share this Story:

Follow Webdunia telugu